Wed Nov 06 2024 01:36:01 GMT+0000 (Coordinated Universal Time)
నిరాశ పరిచిన తేజ.. మ్యాచ్ గెలిచిన పాక్
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మొదటి మ్యాచ్ లో గెలుపును
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మొదటి మ్యాచ్ లో గెలుపును అందుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను ఓడించింది. 287 పరుగుల లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ ను 205 పరుగులకే పరిమితం చేసింది. ఒకానొక దశలో మంచి ఊపు మీద కనిపించిన డచ్ జట్టు.. ఆ తర్వాత 41 ఓవర్లలోనే ఆలౌట్ అయింది.
పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, హసన్ అలీ 2, షహీన్ అఫ్రిది 1, ఇఫ్తికార్ అహ్మద్ 1, మహ్మద్ నవాజ్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు. నెదర్లాండ్స్ జట్టులో ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ (52), బాస్ డీ లీడ్ (67) అర్ధసెంచరీలతో రాణించినా, మిగతా వాళ్లు విఫలమయ్యారు. చివర్లో లోగాన్ వాన్ బీక్ 28 పరుగులు చేయడంతో నెదర్లాండ్స్ స్కోరు 200 మార్కు దాటింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (0) డకౌట్ అయ్యాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్న తేజ నిడమనూరు కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్ 68, సాద్ షకీల్ 68 పరుగులు చేశారు. లోయరార్డర్ లో మహ్మద్ నవాజ్ 39, షాదాబ్ ఖాన్ 32 పరుగులు చేయగా.. చివర్లో హరీస్ రవూఫ్ 16, షహీన్ అఫ్రిది 13 (నాటౌట్) పరుగులు నమోదు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్ లో బాస్ డీ లీడ్ 4 వికెట్లు తీశాడు. కొలిన్ అకెర్ మన్ 2, ఆర్యన్ దత్ 1, వాన్ బీక్ 1, వాన్ మీకెరెన్ 1 వికెట్ పడగొట్టారు.
Next Story