Fri Jan 10 2025 11:05:45 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్.. ఇరు జట్లకూ చాలా ముఖ్యమే..!
టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ ఇంతకు ముందు మ్యాచ్ లో ఓటములను చవిచూశాయి. పాకిస్థాన్ జింబాబ్వేతో ఒక పరుగు తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. నెదర్లాండ్స్‌ను భారతదేశం ఓడించింది. పెర్త్ వేదికగా పాకిస్థాన్ నెదర్లాండ్స్ తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది. వికెట్ బ్యాటర్లు, స్పిన్నర్ల కంటే సీమ్ బౌలర్లకు బాగా సహాయపడుతుంది.
ICC T20 వరల్డ్ కప్ 2022 గ్రూప్ 2 మ్యాచ్ పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్ మధ్య ఆదివారం, అక్టోబర్ 30న జరగనుంది. పెర్త్‌లోని పెర్త్ స్టేడియంలో జరగనుంది. పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్ మధ్య మధ్యాహ్నం 12:30 IST (స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు) ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్‌ని చూడవచ్చు.
నెదర్లాండ్స్ స్క్వాడ్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, కోలిన్ అకెర్మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ టిమ్మ్ డెర్ మెర్వే వాన్ డెర్ గుగ్టెన్, స్టీఫన్ మైబర్గ్, తేజా నిడమనూరు, బ్రాండన్ గ్లోవర్
పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజం(c), షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిం జూనియర్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్, ఖుష్దీల్ షా, ఫఖర్దిల్ షా జమాన్, ఆసిఫ్ అలీ
Next Story