Sat Apr 12 2025 16:51:33 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Pakisthan : టాస్ గెలిచిన పాక్.. తొలుత బ్యాటింగ్
భారత్ - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టాస్ ను పాకిస్థాన్ గెలుచుకుంది

భారత్ - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టాస్ ను పాకిస్థాన్ గెలుచుకుంది. తొలుత పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో టాస్ కీలకం అని తొలి నుంచి క్రీడానిపుణులు చెబుతున్నారు. టాస్ మాత్రం పాక్ కు అనుకూలంగా పడింది. అయితే తొలుత బ్యాటింగ్ చేయనున్న పాక్ ను తక్కువ పరుగులకు కట్టడి చేయాల్సి ఉంది.
బౌలర్లపైనే భారం...
ఇందుకు భారత్ బౌలర్లు శ్రమించాల్సి ఉంది. దుబాయ్ లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కావడంతో ఈ మ్యాచ్ లో స్పిన్నర్లే గేమ్ ఛేంజర్లుగా మారనున్నారు. అందుకే రెండు వందల లోపు పాకిస్థాన్ ను కంట్రోల్ చేయగలిగితే భారత్ సునాయాసంగా విజయం సాధించవచ్చు. అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే సులువగా ఛేదించవచ్చని క్రీడానిపుణుల అంచనా.
Next Story