Sun Dec 22 2024 21:35:09 GMT+0000 (Coordinated Universal Time)
Paris Olympics 2024 Day 1 India Schedule పారిస్ ఒలింపిక్స్ లో మొదటి రోజు.. ఇండియా షెడ్యూల్ ఇదే!!
పూల్ B మ్యాచ్: భారత్ vs న్యూజిలాండ్
పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజైన శనివారం.. రోవర్ బల్రాజ్ పన్వర్, భారత షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత పురుషుల హాకీ జట్టు న్యూజిలాండ్‌పై తలపడనుంది. ఈ రోజు బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్‌లలో మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. బ్యాడ్మింటన్‌లో లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ మ్యాచ్‌లో ఆడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పోరాటం మొదలవ్వనుంది. రోహన్ బోపన్న, ఎన్ శ్రీరామ్ బాలాజీతో కలిసి పురుషుల డబుల్స్‌లో పాల్గొననున్నాడు. ఇదే తన చివరి ఒలింపిక్స్ అని ఇప్పటికే రోహన్ బోపన్న ప్రకటించేశారు.
పారిస్ ఒలింపిక్స్ లో మొదటి రోజు.. ఇండియా షెడ్యూల్ ఇదే!!
బ్యాడ్మింటన్
*పురుషుల సింగిల్స్ గ్రూప్ మ్యాచ్: లక్ష్య సేన్ vs కెవిన్ కార్డన్ (గ్వాటెమాల) (సాయంత్రం 7:10 IST)
*పురుషుల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి vs లుకాస్ కార్వీ - రోనన్ లాబర్ (ఫ్రాన్స్) (రాత్రి 8గం. IST).
*మహిళల డబుల్స్ గ్రూప్ మ్యాచ్: అశ్విని పొన్నప్ప - తనీషా క్రాస్టో vs కిమ్ సో యోంగ్ - కాంగ్ హీ యోంగ్ (కొరియా) (11:50pm IST)
బాక్సింగ్
*మహిళల 54 కేజీల ఓపెనింగ్ రౌండ్ బౌట్: ప్రీతి పవార్ vs థి కిమ్ అన్హ్ వో (వియత్నాం) (జనవరి 28న ఉదయం 12.05).
పురుషుల హాకీ
*పూల్ B మ్యాచ్: భారత్ vs న్యూజిలాండ్ (రాత్రి 9గం IST)
రోయింగ్
*పురుషుల సింగిల్ స్కల్స్: పన్వర్ బాల్‌రాజ్ (మధ్యాహ్నం 12:30 IST)
టేబుల్ టెన్నిస్
*పురుషుల సింగిల్స్ ప్రిలిమినరీ రౌండ్: హర్మీత్ దేశాయ్ vs జోర్డాన్‌కు చెందిన జైద్ అబో యమన్ (సాయంత్రం 7:15 IST)
టెన్నిస్
*పురుషుల డబుల్స్ మొదటి రౌండ్ మ్యాచ్: రోహన్ బోపన్న-ఎన్ శ్రీరామ్ బాలాజీ vs ఎడ్వర్డ్ రోజర్-వాసెలిన్ - ఫాబియన్ రెబౌల్ (ఫ్రాన్స్) (3:30pm IST)
షూటింగ్
*10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ అర్హత: సందీప్ సింగ్/ఎలవెనిల్ వలరివన్, అర్జున్ బాబుటా/రమితా జిందాల్ (12:30pm IST).
* మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మెడల్ రౌండ్లు - మధ్యాహ్నం 2:00 గంటల నుంచి (భారత్ అర్హత సాధిస్తే)
*10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల అర్హత: అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ (మధ్యాహ్నం 2గం IST).
* 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల అర్హత: మను భాకర్- రిథమ్ సాంగ్వాన్ (సాయంత్రం 4 గంటలకు IST).
Next Story