Mon Dec 23 2024 07:11:07 GMT+0000 (Coordinated Universal Time)
Manu Bhaker: భారత్ కు తొలి పతకం.. కాంస్యం సొంతం
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలిపతకం దక్కింది. మను బాకర్ మూడో స్థానంలో
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలిపతకం దక్కింది. మను బాకర్ మూడో స్థానంలో నిలిచి రజతం తెచ్చింది. హర్యానాకు చెందిన 22 ఏళ్ల మను బాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్లో మూడో స్థానం సాధించి, ఈ ఈవెంట్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్గా నిలిచింది. ఫ్రెంచ్ రాజధానిలోని చటౌరోక్స్ షూటింగ్ సెంటర్లో పిస్టల్ ఫైనల్ ఈవెంట్ లో మను బాకర్ మూడో స్థానంలో నిలిచింది. 10 మీటర్ల వ్యక్తిగత విభాగం ఫైనల్స్ లో మొత్తం మూడు పతకాల కోసం 10 మంది షూటర్లు తలపడ్డారు.
గత ఒలింపిక్స్ లో దారుణంగా విఫలమైన మను ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం అత్యుత్తమంగా రాణించింది. క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలలో 22 సంవత్సరాల మను 580 పాయింట్లు సాధించడం ద్వారా మూడో అత్యుత్తమ షూటర్ గా ఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకొంది. హంగెరీ షూటర్ వెరోనియా 582 పాయింట్లతో టాపర్ గా నిలిచింది. ఇదే విభాగంలో పోటీకి దిగిన మరో భారత షూటర్ రిథిమా సంగ్వాన్ 573 పాయింట్లతో 15వ స్థానం సాధించడం ద్వారా ఫైనల్లో చోటు దక్కించుకోలేకపోయింది.
Next Story