Mon Dec 23 2024 19:32:53 GMT+0000 (Coordinated Universal Time)
Anand Mahindra : మహీంద్ర మాట ఇచ్చాడంటే.. ఇచ్చిపడేస్తాడంతే
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మాట ఇస్తే ఆయన తప్పు
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే పరిణామాలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. అంతే కాదు చిన్నా.. పెద్దా అని లేదు.. ఎవరినైనా ప్రశంసలతో ముంచెత్తి మంచి బహుమానం అందచేస్తారు. ఆయన మాటంటే మాటే. అందుకే ఆయన దృష్టిలో పడాలని కూడా అనేక మంది ఆరాటపడుతుంటారు. సోషల్ మీడియాలో తమ ప్రతిభను కనపర్చే అంశాలను పోస్టు చేస్తూ మహీంద్రా దృష్టి తమ వైపు పడాలని ప్రయత్నిస్తుంటారు.
టెస్ట్ మ్యాచ్ లో...
తాజాగా తాను ఇచ్చిన మాట ప్రకారం ఆనంద్ మహీంద్రా ప్రముఖ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి థార్ కారును బహుమతిగా పంపారు. సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల టీం ఇండియా తరుపున ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో తొలిసారి క్యాప్ లభించడంతో ఆయన తండ్రి నౌషాద్ ఖాన్ ఉద్విగ్నానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సిరీస్ లో సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు చేసి టీం ఇండియా విజయానికి కూడా కారణమయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసన మ్యాచ్ లోనే అదరగొట్టాడు.
నౌషధ్ ఖాన్ కు...
తండ్రి నౌషధ్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్కు కోచ్ గా వ్యవహరించాడు. మైదానంలో సర్ఫరాజ్ ఆటతీరును చూసిన ఆనంద్ మహీంద్ర మురిసిపోయారు. వెంటనే ఆయన తండ్రికి తాను థార్ కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తండ్రిగా నౌషాద్ ఖాన్ పిల్లలకు అందించిన ధైర్యాన్ని, ఆయన పడిన శ్రమను ట్విట్టర్లో ప్రశంసించారు. అందుకే తాను నౌషద్ ఖాన్ కు థార్ కారును కానుకగా ఇస్తున్నానని, దానిని స్వీకరించాలని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన థార్ కారును నౌషద్ ఖాన్ ఇంటికి పంపారు. ఈ విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story