Mon Dec 23 2024 02:47:29 GMT+0000 (Coordinated Universal Time)
మయాంక్ అగర్వాల్ ను వదులుకోవడం లేదు: పంజాబ్ కింగ్స్
పంజాబ్ ఫ్రాంచైజీ ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విఫలమైంది. ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ కుంబ్లే కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించడం
ఐపీఎల్ కు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇటీవల మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టు వార్తల్లో నిలిచింది. ఆ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కు ఉద్వాసన పలుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. IPL 2023 కు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది.. అయితే IPL ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేను వదిలిపెట్టనుందని, మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా తొలగించాలని చూస్తున్నట్లు కూడా నివేదించబడింది. అయితే పంజాబ్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ వదంతులను ఖండించింది.
IPL 2022 కూడా పంజాబ్ కు కలిసి రాలేదు. పంజాబ్ ఫ్రాంచైజీ ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విఫలమైంది. ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ కుంబ్లే కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించడం మానుకుంది. 2022లో కుంబ్లే మూడేళ్ల పదవీకాలం ముగిసింది. జట్టు ఘోరంగా విఫలమవుతూ ఉండడంతో పంజాబ్ యాజమాన్యం కూడా అయోమయంలో పడింది. ఇలాంటి సమయంలో ఈ వార్తలు వస్తున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ ట్విట్టర్ లో ఈ వివాదాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మయాంక్ కెప్టెన్సీ గొప్పగా లేకపోవడంతో ఇతర కెప్టెన్సీ ఎంపికలను పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. "మయాంక్ నాయకత్వం వహించే విషయం భవిష్యత్తు ప్రణాళికలో లేదు. అతను బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి. అతను మాకు కీలక ఆటగాడు. అనిల్ విషయానికొస్తే.. మేము కొన్ని ఎంపికలను చర్చిస్తున్నాము, కానీ ఇంకా ఏదీ కార్యరూపం దాల్చలేదు. మాకు సమయం ఉంది. మేము సరైన సమయంలో ప్రకటన చేస్తాము" అని పంజాబ్ కింగ్స్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో అన్నారు.
ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్లో ఆ వాదనలను ఖండించింది. "పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కెప్టెన్సీకి సంబంధించి ఒక నిర్దిష్ట స్పోర్ట్స్ న్యూస్ వెబ్సైట్ ప్రచురించిన వార్తా నివేదికలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. టీమ్‌లోని ఏ అధికారి కూడా దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని మేము చెప్పాలనుకుంటున్నాము" అని ట్వీట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో లక్నో సూపర్ జెయింట్‌కు భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ వెళ్లిపోగా.. మయాంక్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Next Story