Mon Apr 07 2025 20:58:18 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : లక్నోపై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
లక్నో సూపర్ జెయింట్స్ మీద పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

లక్నో సూపర్ జెయింట్స్ మీద పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. దాని సొంత గడ్డ మీద ఓడించి తమ సత్తా ఏందో చాటింది. పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆడటంతో పాటు ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ కు విజయం లభించింది. తొలి మ్యాచ్ ను గుజరాత్ పై ఓడించిన పంజాబ్ కింగ్స్ తర్వాత వరసగా లక్నోపై కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎగబాకింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి లక్నో బ్యాటర్లను త్వరత్వరగా పెవిలియన్ కు పంపపడంతోనే దాని విజయం ముందే డిసైడ్ అయింది. వరసగా మంచి ఆటగాళ్లు సయితం పంజాబ్ బౌలర్ల దెబ్బకు కుదేలయిపోయారు. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ను సులువుగానే మట్టికరిపించింది.
తొలుత బ్యాటింగ్ చేసి...
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూరన్ నలభై నాలుగుర, బదోని 41పరుగులుతో మాత్రమే రాణించారు. మిగిలిన ఆటగాళ్లు ఎవరూ పెద్దగా పంజాబ్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. అర్షదీప్ మూడు వికెట్లు తీసి లక్నో వెన్ను విరిచాడు. చాహల్ ఒకటి, మ్యాక్స్ వెల్ ఒకటి, యాన్సెస్ ఒకటి, ఫెర్గూసన్ ఒక వికెట్ తీసి లక్నోను తక్కువ పరగులకే కట్టడి చేయగలిగారు. అయితే ఇది పెద్ద స్కో కాకపోవడంతో పంజాబ్ విజయం ముందుగానే డిసైడ్ అయింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో బ్యాట్ ను ఝుళిపించారు. లక్నో బౌలర్లను ఉతికి ఆరేశారు.
తడబాటు లేకుండానే...
ప్రభమిన్ సింబగ్ అరవై రెండు పరుగుులు, శ్రేయస్ అయ్యర్ 52 పరుగులు చేశారు. వాళ్లిద్దరూ ఎక్కడా వెనక్కు తిరిగి చూసుకోలేదు. నేహాల్ వధేరా 43తో నాటౌల్ గా నిలవడంతో పంజాబ్ కింగ్స్ విజయం ఖాయమయింది. వరసగా మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది పంజాబ్ కింగ్స్ కు విజయాన్ని సాధించిపెట్టాడు. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో బ్యాటర్లు కొంత మేరకు తడబడ్డారు. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం ఏ మాత్రం తడబడలేదు. పవర్ ప్లేలోని కేవలం ఒక వికెట్ కోల్పోయి 62 పరుగులు సాధించడంతో పంజాబ్ విజయాన్ని అందరూ ముందుగానే ఊహించారు. లక్నో బౌలర్లను అస్సలు కనికరించకుండా బాదడంతో చివరకు పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.
Next Story