Mon Dec 23 2024 02:45:15 GMT+0000 (Coordinated Universal Time)
తగ్గేదేలే అన్న జడేజా
పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతగా ఆకట్టుకున్న పుష్ప మూవీ ఇప్పుడు క్రికెట్ ను కూడా వదిలిపెట్టలేదు.
Jadeja : పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇక పుష్ప సినిమాలో సాంగ్స్ కు ఫిదా కాని వారు ఎవరూ లేరు. బాలీవుడ్ సెలబ్రిటీ లందరూ పుష్స సినిమా సాంగ్స్ కు డ్యాన్స్ లు వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇక పుష్ప డైలాగులు రాజకీయ నేతలను వదిలిపెట్టడం లేదు. సాక్షాత్తూ రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పుష్ప డైలాగులు చెప్పి యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
వికెట్ తీసిన తర్వాత.....
యూపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పుష్ప సినిమా సాంగ్స్ ట్యూన్స్ తో పార్టీ పాటలను రూపొందించింది. అంతగా ఆకట్టుకున్న పుష్ప మూవీ ఇప్పుడు క్రికెట్ ను కూడా వదిలిపెట్టలేదు. నిన్న భారత్ - శ్రీలకం మధ్య జరిగిన టీ 20 తొలి మ్యాచ్ లో రవీంద్ర జడేజా తగ్గేదేలా అన్నట్లు ఫోజు ఇచ్చారు. ఆయన వికెట్ తీసుకున్న వెంటనే తగ్గేదేలే అంటూ స్టిల్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప సినిమా మానియా ఎవరిని వదిలిపెట్టలేదనడానికి ఇదే ఎగ్జాంపుల్.
Next Story