పీవీ సింధు నుండి ఆ ప్రకటన.. అంత నొప్పిని తట్టుకుందా..!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత దేశానికి బంగారు పతకం తీసుకుని వచ్చిన షట్లర్ పీవీ సింధు
పీవీ సింధు వరుస విజయాలతోనూ, పతకాలతోనూ దూసుకుపోతూ ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత దేశానికి బంగారు పతకం తీసుకుని వచ్చిన షట్లర్ పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా శనివారం రాత్రి ఓ భావోద్వేగభరిత ప్రకటనను పోస్ట్ చేసింది. తాను బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్ కు దూరమవుతున్నానని తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో తన కాలికి గాయమైందని, దాని కారణంగానే తాను వరల్డ్ చాంపియన్ షిప్‌నకు హాజరు కాలేకపోతున్నానని తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్స్‌లో తన కాలికి గాయమైందని… అయితే గెలుపే లక్ష్యంగా సాగిన తాను కామన్వెల్త్ నుంచి వైదొలగేందుకు సిద్ధపడలేదని సింధు తెలిపింది. ఈ క్రమంలో తన కోచ్, ఫిజియో, ట్రైనర్ల సాయంతో ఎంత దాకా వీలయితే అంతదాకా పోరాడాలనే నిర్ణయించుకున్నానని తెలిపింది. సెమీస్‌తో పాటు ఫైనల్స్‌లోనూ గాయం కారణంగా భరించలేని నొప్పిని తట్టుకుని నిలబడ్డానని తెలిపింది. ఆ శ్రమ కారణంగానే తనకు బంగారు పతకం వచ్చిందని తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్ ముగియగానే హైదరాబాద్‌కు చేరుకున్నానని.. ఆసుపత్రికి వెళ్లి ఎంఆర్ఐ చేయించుకున్నానని సింధు తెలిపింది. ఎడమ పాదంలో చీలిక ఏర్పడినట్టు వైద్యులు తేల్చారని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో కొన్ని వారాల పాటు విశ్రాంతి తప్పనిసరి అని వైద్యులు సూచించారని తెలిపింది. ఈ కారణంగానే తాను వరల్డ్ చాంపియన్ షిప్‌నకు హాజరు కాలేకపోతున్నానని తెలిపింది. సింధు త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు.