Fri Dec 20 2024 11:39:11 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Dravid Son: వేలంపాటలో అమ్ముడు పోయిన రాహుల్ ద్రావిడ్ కుమారుడు
భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్, కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌ను
భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్, కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌ను కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో మైసూరు వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది. సమిత్ ను మహారాజా ట్రోఫీ KSCA T20 సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలం సందర్భంగా తీసుకున్నారు.
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, సీమర్ అయిన సమిత్ సేవలను వారియర్స్ 50 వేల రూపాయలకు పొందనున్నారు. పలు టోర్నమెంట్ లలో సమిత్ బాగా ఆడాడని అందుకే తమ జట్టుకు ఎంపిక చేశామని వారియర్స్ టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. సమిత్ ఈ సీజన్ కూచ్ బెహర్ ట్రోఫీని గెలుచుకున్న కర్ణాటక అండర్-19 జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో లంకేషైర్ జట్టుపై KSCA XI తరపున కూడా సమిత్ ఆడాడు. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన వారియర్స్‌కు కరుణ్ నాయర్ నాయకత్వం వహిస్తాడు. భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా జట్టులో ఉండటంతో వారి బౌలింగ్‌కు బలం చేకూరుతుంది.
మైసూర్ వారియర్స్ జట్టు: కరుణ్ నాయర్, కార్తీక్ సిఎ, మనోజ్ భాండాగే, కార్తీక్ ఎస్ యు, సుచిత్ జె, గౌతమ్ కె, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ EJ, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సర్ఫరాజ్ అష్రఫ్.
Next Story