Fri Dec 20 2024 22:45:00 GMT+0000 (Coordinated Universal Time)
ఐపీఎల్కు ప్రారంభానికి ముందే ఫ్యాన్స్ కు షాక్... కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాకముందే రాజస్థాన్ రాయల్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ ఆడటం లేదు
ఐపీఎల్ 2023 షెడ్యూల్ ను విడుదలయింది. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ లు ప్రారంభం కాకముందే రాజస్థాన్ రాయల్స్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ ఆడటం లేదు. గాయం కారణంగా ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లకు ప్రసిద్ధ్ కృష్ణ దూరమయ్యాడని చెబుతున్నారు. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్రకటించింది.
రాజస్థాన్ రాయల్స్ నుంచి...
అయితే ప్రసిద్ధ్ కృష్ణ గాయం నుంచి కోలుకోవడానికి తాము అన్ని విధాలుగా సహకరిస్తామని, సాయం అందిస్తామని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తెలిపింది. కానీ అతడు ఐపీఎల్ సీజన్ కు కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పడంతో తాము ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని ఆర్ఆర్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ప్రసిద్ధ్ కృష్ణ స్థానాన్ని భర్తీ చేసే మరొక ఆటగాడి కోసం తాము ప్రయత్నిస్తున్నామని తెలిపింది. రాజస్థాన్ రాయల్స్ ఈ ప్రకటన చేయడంతో ప్రసిద్ధ్ కృష్ణ అభిమానులు ఒకింత షాక్ కు గురయ్యారు. గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో రాణించిన ప్రసిద్ధ్ కృష్ణ టీం ఇండియా జట్టులోనూ స్థానం సంపాదించాడు.
Next Story