Sun Dec 22 2024 18:39:20 GMT+0000 (Coordinated Universal Time)
Rashid Khan Marriage: మాట తప్పిన స్టార్ ఆటగాడు.. పెళ్లి చేసేసుకున్నాడు!!
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ కు మంచి పాపులారిటీ తెచ్చిన ఆటగాడు
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ కు మంచి పాపులారిటీ తెచ్చిన ఆటగాడు రషీద్ ఖాన్. అతడు తన బౌలింగ్ శైలితో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా బ్యాటింగ్ తో కూడా మెరుపులు మెరిపించాడు. అటు ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే కాకుండా, పలు దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్ లలో కూడా తన సత్తా చాటాడు. ఆఫ్ఘనిస్థాన్ జట్టు పసి కూన కాదని అద్భుతమైన విజయాలతో రషీద్ ఖాన్ నిరూపించుకున్నాడు.
రషీద్ ఖాన్ కాబూల్‌లో వివాహం చేసుకున్నాడు. రషీద్ ఆఫ్ఘనిస్తాన్ సహచరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన ముగ్గురు సోదరులతో కలిసి వివాహం చేసుకున్నాడు. పలువురు ఆటగాళ్ళు పోస్ట్ చేసిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రషీద్ ఖాన్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన సమాచారం అయితే బయటకు రాలేదు. రషీద్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు నుండి విరామం తీసుకున్నాడు. గత సంవత్సరం రషీద్ వెన్నుముకను శస్త్ర చికిత్స నిర్వహించారు. అందుకోసమే సుదీర్ఘమైన ఫార్మాట్ నుండి తాత్కాలిక విరామం తీసుకోవాల్సి వచ్చింది. అక్టోబరు-నవంబర్‌లో భారతదేశంలో 2023 ODI ప్రపంచ కప్ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్న రషీద్ నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.
ఇక రషీద్ 2020లో మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్థాన్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తే కానీ తాను పెళ్లి చేసుకోనని తెలిపాడు. ప్రపంచ కప్‌ను సాధించిన తర్వాత మాత్రమే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. రషీద్‌ఖాన్ ‘ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ గెలిచిన తర్వాతే నేను నిశ్చితార్థం చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను’ అని పాకిస్థాన్ జర్నలిస్టు సాజ్ సాదిక్ కూడా ట్వీట్ చేశారు. అప్పట్లో 21 సంవత్సరాల వయసు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ 'ఆజాదీ రేడియో'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే రషీద్ తన మాట నిలబెట్టుకోలేదంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఇక చాలా మంది క్రికెట్ లవర్స్ రషీద్ ఖాన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Next Story