Mon Dec 23 2024 18:28:47 GMT+0000 (Coordinated Universal Time)
నా వెంట పడకు అక్కా.. అబద్ధాలకు కూడా హద్దులు ఉంటాయంటున్న రిషబ్ పంత్
ఇది చివరికి రిషబ్ పంత్ దాకా చేరింది. రిషబ్ పంత్ ఊర్వశీ పేరును ప్రస్తావించకుండా
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మధ్యలో ఏదో జరుగుతోందని కొన్నాళ్ల కిందట ప్రచారం జరిగింది. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని రిషబ్ పంత్ గతంలోనే చెప్పుకొచ్చాడు. ఊర్వశీని ఏకంగా బ్లాక్ కూడా చేశానని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. తాను ఈషా నేగి అనే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని రిషబ్ క్లారిటీ ఇచ్చాడు. పంత్ గురించి ఊర్వశీ రౌతేలా తరచూ ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి రిషబ్ పంత్ ను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది ఊర్వశీ. 'ఆర్పీ' తన ఇంటికి వచ్చి లాబీలో గంటలకొద్ది వేచి చూశాడని చెప్పింది. అతడిని కలవాలని అనుకున్నా.. బాగా అలసిపోవడంతో నిద్రపోయానని చెప్పుకొచ్చింది. లేచి చూసే సరికి ఆర్పీ నుంచి 16-17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పింది. ఆర్పీ ఎవరు అని యాంకర్ ప్రశ్నిస్తే.. ఊర్వశీ మాత్రం వివరణ ఇవ్వలేదు. ఆర్పీ అంటే రిషబ్ పంత్ అని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇది చివరికి రిషబ్ పంత్ దాకా చేరింది. రిషబ్ పంత్ ఊర్వశీ పేరును ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చాడు. వార్తల్లో నిలవడం కోసం ఇంటర్వ్యూల్లో అబద్ధాలను చెప్పే వాళ్లను చూస్తే నవ్వొస్తోందన్నాడు. పేరు, ప్రఖ్యాతుల కోసం వాళ్లు ఇలా దిగజారడం బాధపడాల్సిన అవసరం అని చెప్పుకొచ్చాడు. 'నా వెంట పడకు అక్కా.. అబద్ధాలకు కూడా హద్దులు ఉంటాయి' "merapichachorhoBehen #Jhutkibhilimithotihai అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించాడు.
News Summary - Rishabh Pant deletes ‘mera picha chhoro’ Instagram story
Next Story