ఏజ్ అడ్డుకాదు.. 43 ఏళ్ల వయసులో నంబర్ 1
పురుషుల డబుల్స్‌లో ఈ వయస్సులో నెం1గా నిలవడం నిజంగా అద్భుతం
ఏదైనా సాధించాలని అనుకుంటే వయసు అడ్డంకి అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ అదేదీ నిజం కాదు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా ఎన్నో విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాంటి వారిలో భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న ఒకరు. రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా అరుదైన రికార్డు సాధించాడు. 43 ఏళ్ల బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెన్స్ డబుల్స్ లో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి రోహన్ బోపన్న బరిలోకి దిగాడు. తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్మూడో స్థానంతో ఈ గ్రాండ్ స్లామ్లో అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా జంట మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రూ మోల్టెనిపై బోపన్న జోడి 6-4, 7-6 విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్ ముగిసిన అనంతరం తాజా ర్యాంక్‌లను అధికారికంగా ప్రకటిస్తారు.