Fri Dec 20 2024 05:29:14 GMT+0000 (Coordinated Universal Time)
Rohit Sharma: రోహిత్ శర్మ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే పండంటి మగబిడ్డ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. శుక్రవారం, నవంబర్ 15 తమ జీవితాల్లోకి ఈ జంట రెండవ బిడ్డను స్వాగతించింది. 2018లో కుమార్తె సమైరా పుట్టింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియాలో శిక్షణా సెషన్లకు ముందు రోహిత్ శర్మ తన భార్య పక్కన ఉండటానికి కాస్త విరామం తీసుకున్నారు. ఈ జంట రితికా గర్భాన్ని చాలా కాలం పాటు దాచిపెట్టారు. పెర్త్లో జరిగే 1వ టెస్టులో రోహిత్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొని ఉన్న నేపథ్యంలో ఇటీవలే ఈ వార్త ప్రజలకు తెలిసింది. రోహిత్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్ సమయానికి భారత జట్టులో చేరతాడా అనేది చూడాలి. అతని గైర్హాజరు టీమ్ ఇండియాకు కొత్త సవాళ్లను కలిగిస్తుంది. అయితే రోహిత్ టీమిండియాతో చేరే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.
రోహిత్, రితిక డిసెంబర్ 13, 2015 న ఘనంగా వివాహం చేసుకున్నారు. మూడు సంవత్సరాల తరువాత, ఈ జంట సమైరాను 2018లో స్వాగతించారు. ఆరు సంవత్సరాల తరువాత మరో బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు
Next Story