కెప్టెన్సీని నిలబెట్టుకున్న రోహిత్ శర్మ
టెస్టు వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ తన స్థానం నిలుపుకున్నాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా పదోన్నతి పొందగా,
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఈవెంట్లలో భారత్ ఆశించినంతగా రాణించకపోవడంతో రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగిస్తారనే ప్రచారం సాగింది. కానీ వాటిని బీసీసీఐ పట్టించుకోలేదు. త్వరలోనే ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్లను ప్రకటించారు. టీమిండియా టెస్టు, వన్డే జట్లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఐపీఎల్ లో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ టీమిండియా టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. అయితే జైస్వాల్ కు వన్డే జట్టులో స్థానం లభించలేదు. ఐపీఎల్ లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, మీడియం పేసర్ ముఖేశ్ కుమార్ లను కూడా సెలెక్టర్లు టీమిండియా టెస్టు, వన్డే జట్లకు ఎంపిక చేశారు. టెస్టు వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ తన స్థానం నిలుపుకున్నాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా పదోన్నతి పొందగా, వెటరన్ బ్యాట్స్మెన్ అజింక్యా రహానే తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు.