Thu Dec 19 2024 17:00:29 GMT+0000 (Coordinated Universal Time)
బయటకొచ్చిన రోహిత్ శర్మ
దక్షిణాఫ్రికాలో జరిగే సిరీస్ కోసం భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, రోహిత్ చాలా కాలం పాటు మౌనంగానే ఉన్నాడు
నవంబర్ 19 రాత్రి, 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ బాధను భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అహ్మదాబాద్లో ఫైనల్ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ ఆరోజు ప్రెజెంటేషన్ వేడుకలో బాధతోనే ప్రసంగించాడు. బాధలో ఉన్న భారతజట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. ఇక ఆ తర్వాత భారత కెప్టెన్ ఎక్కడా మాట్లాడలేదు.
దక్షిణాఫ్రికాలో జరిగే సిరీస్ కోసం భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, రోహిత్ చాలా కాలం పాటు మౌనంగానే ఉన్నాడు. మ్యాచ్ అనంతరం అనుభవించిన భావోద్వేగాలని రోహిత్ శర్మ తాజాగా ఓ వీడియోలో వెల్లడించాడు. మ్యాచ్ ఓడిపోయాక అందులో నుండి ఎలా బయట పడాలో నాకు తెలియలేదు. మొదటి కొన్ని రోజులు, నేను ఏమి చేయాలో నాకే అర్థం అవ్వలేదు. ఫైనల్ ఓటమి తర్వాత ముందుకు సాగడం చాలా కష్టం, అందుకే నేను మౌనంగా ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నా, ప్రజలు నా వద్దకు వస్తున్నారని, ప్రతి ఒక్కరు భారత జట్టు ప్రయత్నాన్ని అభినందిస్తున్నారని నేను గ్రహించానన్నాడు రోహిత్. ప్రజలందరూ భారత జట్టు ప్రపంచకప్ను కైవసం చేసుకోవాలని కలలు కన్నారని 'టీమ్ రో' ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియోలో రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
"నేను ఎప్పుడూ 50 ఓవర్ల ప్రపంచకప్ని చూస్తూ పెరిగాను. నాకు అదే అంతిమ బహుమతి, 50 ఓవర్ల ప్రపంచకప్. మేము ఆ ప్రపంచ కప్ కోసం ఇన్నాళ్లూ పనిచేశాం. ఇది నిరాశపరిచింది, మీరు కోరుకున్నది పొందకపోతే మీరు నిరాశ చెందుతారు.. అదే మా విషయంలో కూడా జరిగింది" అని రోహిత్ తెలిపాడు.
Next Story