Fri Dec 20 2024 01:24:51 GMT+0000 (Coordinated Universal Time)
సిరీస్ మనదే.. నాలుగో రోజు సాగిందిలా!!
భారతజట్టు రాంచీ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్
భారతజట్టు రాంచీ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను మరో టెస్టు మిగిలుండగానే చేజిక్కించుకుంది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సేన 5 వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించినా... శుభ్ మాన్ గిల్, ధ్రువ్ జురెల్ జోడీ ఆరో వికెట్ కు అజేయంగా 72 పరుగులు జోడించి భారత్ కు విజయాన్ని అందించింది. గిల్ 52, జురెల్ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు, రూట్ 1, టామ్ హార్ట్ లే 1 వికెట్ తీశారు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 55, యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేశారు. రజత్ పాటిదార్ (0), రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా, టీమిండియా 307 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఇంగ్లండ్ ను రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు 145 పరుగులకు కుప్పకూల్చారు. అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో రాణించారు. రాంచీ టెస్టులో విజయంతో టీమిండియా ఈ ఐదు టెస్టుల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.
Next Story