Fri Dec 20 2024 06:18:54 GMT+0000 (Coordinated Universal Time)
రిటైర్మెంట్ గురించి రోహిత్ వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఖుషీనే!!
ఇంగ్లండ్‌పై భారతజట్టు టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది
ఇంగ్లండ్‌పై భారతజట్టు టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ధర్మశాల టెస్టులో ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమ్ ఇండియా. ఓ ఇంటర్వ్యూలో దినేష్ కార్తీక్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ను రిటైర్మెంట్ గురించి అడిగాడు. రోహిత్ చాలా సూటిగా తన సమాధానం చెప్పాడు. అతను ఒక రోజు నిద్రలేచి, క్రికెట్ ఆడటానికి తాను సరిపోలేదని భావిస్తే, ఆ విషయం గురించి జట్టు మేనేజ్మెంట్కు తెలియజేస్తానని చెప్పాడు.
ఒక రోజు నేను లేచిన తర్వాత బాగా ఆడడం లేదని ఫీల్ అయితే, ఆ రోజు కచ్ఛితంగా రిటైర్ అవుతానని రోహిత్ శర్మ తెలిపాడు. గత కొన్నేళ్లుగా నా జీవితంలో బెస్ట్ క్రికెట్ ఆడుతున్నానని.. ఇప్పట్లో ఆ ఆలోచన అయితే లేదన్నాడు రోహిత్. నేను సంఖ్యలని చూసే వ్యక్తిని కాదు.. జట్టు కోసం పరుగులు చేయడం కూడా ముఖ్యమే. ఆటగాళ్ళు చాలా స్వేచ్ఛగా క్రికెట్ ఆడేలా చేయాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. వ్యక్తిగత స్కోర్లను చూడకండి.. మంచి గేమ్ ఆడండి. మీరు బాగా ఆడితే నంబర్లు వాటంతట అవే వస్తాయని చెబుతూ ఉంటానని రోహిత్ శర్మ తెలిపాడు. ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ రెండు సెంచరీలు చేశాడు. 5 మ్యాచుల్లో 400 పరుగులు చేశాడు. ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మూడో రోజు రోహిత్ శర్మ, వెన్ను నొప్పితో ఫీల్డింగ్‌కి రాలేదు.
Next Story