Fri Nov 22 2024 05:49:47 GMT+0000 (Coordinated Universal Time)
రోహిత్ శర్మను వాళ్లు తప్పకుండా అటాక్ చేస్తారు: బ్రెట్ లీ
భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్
భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫ్రీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత ఆటగాళ్లపై అప్పుడే మాటల యుద్ధానికి దిగారు. కొత్త బంతితో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల దాడికి దిగుతానని భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ వార్నింగ్ ఇచ్చాడు. నవంబర్ 22 నుండి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ భారత్, ఆస్ట్రేలియా జట్లకు చాలా కీలకంగా మారనుంది.
భారతజట్టులో సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కారణంగా ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్ట్ సిరీస్‌లో వీరిద్దరూ 100 పరుగులకు పైగా స్కోర్ చేయలేకపోవడంతో భారత క్రికెట్ జట్టు అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. రోహిత్, విరాట్ క్రికెట్‌కు దూరంగా ఉండాలని, వారి టెక్నిక్‌పై పని చేయాలని బ్రెట్ లీ సూచించాడు. కొత్త బంతితో రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు ఎలా దాడి చేస్తారో కూడా బ్రెట్ లీ వివరించాడు.
సరిగా ఆడనప్పుడు ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్స్ టెక్నిక్‌పై దృష్టి పెట్టాలి. భారతజట్టు కివీస్‌ను వైట్‌వాష్ చేయాలని భావించి సిరీస్‌లోకి వెళ్లారు. కానీ కివీస్ అద్భుతంగా ఆడిందని బ్రెట్ లీ తెలిపాడు. ఇక ఆసీస్ సిరీస్ కోసం భారత్ మరింత మెరుగ్గా సన్నద్ధమవుతుందని నమ్ముతున్నానన్నాడు బ్రెట్ లీ. రోహిత్ శర్మ మొదటి టెస్టు మ్యాచ్ లో ఆడుతాడో లేదో అనే అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story