Sun Dec 22 2024 21:42:38 GMT+0000 (Coordinated Universal Time)
నడిరోడ్డుపై కారు ఆపేసిన రోహిత్ శర్మ.. ఫ్యాన్ కు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడంటే?
ప్రాక్టీస్ సెషన్ నుండి తిరిగి వస్తుండగా భారత కెప్టెన్ రోహిత్
అక్టోబరు 9న ముంబయిలో ప్రాక్టీస్ సెషన్ నుండి తిరిగి వస్తుండగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వందలాది మంది అభిమానులు రోహిత్ శర్మను చుట్టుముట్టారు. ఆ సమయంలో రోహిత్ శర్మ తన లగ్జరీ కారును నడుపుతూ కనిపించాడు. రోహిత్ అభిమానులతో ఉండడానికి సమయాన్ని వెచ్చించాడు. రోహిత్ తన కారును ఆపి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు చెప్పిన ఒక మహిళా అభిమానికి శుభాకాంక్షలు తెలిపాడు. చిరునవ్వుతో ఆమెతో కరచాలనం కూడా చేశాడు రోహిత్ శర్మ. ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
అక్టోబర్ 16 నుండి న్యూజిలాండ్తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కోసం రోహిత్ శర్మ శిక్షణ ప్రారంభించాడు. ముంబైలోని శిక్షణా కేంద్రంలో భారత కెప్టెన్ తేలికపాటి వ్యాయామాలు చేశాడు. న్యూజిలాండ్తో జరిగే మూడు టెస్టుల సిరీస్కు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్లో తొలి టెస్టు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ కప్ విజయం తర్వాత T20Iల నుండి రిటైర్ అయిన రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడానికి కాస్త సమయం దొరికింది.
Next Story