Mon Dec 23 2024 01:48:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆ మార్పుతో పాక్ కు చెమటలు
వరల్డ్ కప్ లో క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన సమయం ఆసన్నమైంది
వరల్డ్ కప్ లో క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన సమయం ఆసన్నమైంది. భారత్-పాక్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ముస్తాబైంది. ఈ మ్యాచులో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కూడా ఈ వరల్డ్ కప్ లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయి. భారత జట్టు ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది. ఇషాన్ కిషాన్ స్థానంలో డెంగ్యూ జ్వరం నుంచి కోలుకున్న శుభమన్ గిల్ వచ్చేసాడు. మరోవైపు పాక్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుంది. గిల్ ఐపీఎల్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో అతడు ఎలా ఆడుతాడోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్:
అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది, హరీస్ రవూఫ్
Next Story