Mon Apr 07 2025 12:24:20 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : బెంగళూరు విజయాలకు బ్రేక్.. టైటాన్స్ సూపర్ విక్టరీ
సొంతమైదానమైన బెంగళూరులోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ పై పరాజయం పాలయింది.

ఐపీఎల్ సీజన్ ప్రారంభమయిన తర్వాత తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓటమి లభించింది. తొలి రెండు మ్యాచ్ లు గెలిచిన ఆనందం మాత్రం బెంగళూరులో మిగిల్చలేదు. సొంతమైదానమైన బెంగళూరులోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ పై పరాజయం పాలయింది. రాయల్ ఛాలెంజర్స్ సమిష్టిగా విఫలం కావడమే దీనికిప్రధాన కారణం కాగా, గుజరాత్ టైటాన్స్ లో బౌలర్లు, బ్యాటర్లు రాణించడం దాని విజయానికి ప్రధాన కారణంగా చెప్పాలి. వరస విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ ఇచ్చినట్లయింది.
దారుణంగా దెబ్బతీసి...
తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సిరాజ్ దారుణంగా దెబ్బతీశాడు. గత సీజన్ వరకూ సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉండేవాడు. ఆ జట్టులో ఉన్నప్పుడు అంతగా ప్రభావం చూపని హైదరాబాదీ ఆటగాడు సిరాజ్ ఈ సీజన్ లో మాత్రం వికెట్ల మీద వికెట్లు తీస్తున్నాడు. ఈ మ్యాచ్ లో సిరాజ్ మూడు వికెట్లు తీశాు. ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, అర్షద్ ఖాన్ తలో వికెట్ తీయగా, సాయికిశోర్ రెండు వికెట్లు తీసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ను దారుణంగా దెబ్బతీశాడు. ఇక సాల్్ట్, కోహ్లి, వడిక్కల్,రజిత్ పాటీదార్ త్వర త్వరగా అవుట్ కావడంతో లివింగ్సి్టన్ మాత్రం 54 పరుగులు చేయగలిగాడు. తెవాతియా,33, టిమ్ డేవిడ్ 3 2 పరుగుల చేయడంతోనే జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది.
బౌలర్లు కూడా అంతే...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 169 పరుగులుమాత్రమే చేయగలిగింది. ఐపీఎల్ లో అతి తక్కువ స్కోరు కావడంతో గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో గెలుస్తుందని ముందుగానే అందరూ అంచనా వేశారు. అంచనాలకు తగినట్లుగానే సాయిసుదర్శన్ 49, బట్లర్ 73 పరుగులు చేయడంతో పాటు రూథర్ ఫర్డ్ నాటౌట్ గా నిలిచి30 పరుగులు చేయగలిగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హేజల్ ఉడ్ మాత్రమే తలో వికెట్ సంపాదించగలిగారు. ఇక మిగిలిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపలేకపోయారు.ఫలితంగా గుజతరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 170 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది.
Next Story