Mon Dec 23 2024 12:38:16 GMT+0000 (Coordinated Universal Time)
Pakistan international umpire కూతురు క్రికెటర్- తల్లి అంపైర్.. సలీమా సక్సెస్ స్టోరీ
మొదటి పాకిస్థానీ మహిళా అంపైర్ గా అరుదైన ఘనత
ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్మెంట్ అంపైర్స్‌కు నామినేట్ అయిన తొలి పాకిస్థాన్ మహిళా అంపైర్‌గా సలీమా ఇంతియాజ్ చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధృవీకరించింది. ఈ ప్రతిష్టాత్మకమైన నామినేషన్ కారణంగా ఇకపై సలీమా ఇంతియాజ్ మహిళల ద్వైపాక్షిక అంతర్జాతీయ మ్యాచ్‌లు, ICC మహిళల ఈవెంట్లలో అంపైర్ గా చేయడానికి అవకాశం లభిస్తుంది. అంపైరింగ్ రంగంలో ఈ స్థాయికి చేరుకున్న మొదటి పాకిస్తానీ మహిళగా ఆమె నిలిచింది.
తాను సాధించిన విజయం పాకిస్తాన్‌లోని ఇతర మహిళలకు స్ఫూర్తినిస్తుందని సలీమా తెలిపింది. "ఇది నా విజయం మాత్రమే కాదు, ఇది పాకిస్తాన్‌లోని ప్రతి మహిళా క్రికెటర్, అంపైర్ల విజయం. క్రీడలో తమదైన ముద్ర వేయాలని కలలు కనే అసంఖ్యాక మహిళలను నా విజయం ప్రేరేపిస్తుందని నేను ఆశిస్తున్నాను." అంటూ సలీమా వివరించింది.
అంపైరింగ్‌లో సలీమా ప్రయాణం 2008లో పీసీబీ మహిళా అంపైర్ల ప్యానెల్లో చేరినప్పటి నుంచి మొదలైంది. సలీమా కుమార్తె కైనాత్ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయడం ద్వారా అంపైర్ గా వ్యవహరించాలనే అభిరుచి సలీమాలో మొదలైంది. కైనాత్ 19 వన్డే ఇంటర్నేషనల్‌లు, 21 T20 ఇంటర్నేషనల్‌లతో సహా పాకిస్తాన్ తరపున 40 మ్యాచ్‌లు ఆడింది.

Next Story