Sun Dec 22 2024 10:29:25 GMT+0000 (Coordinated Universal Time)
INDvsSA: ఊచకోతతో సిరీస్ ను సొంతం చేసుకున్నారు
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. 284 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. 135 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్, తెలుగు తేజం తిలక్ వర్మ బౌలర్లను ఊచకోత కోశారు. శాంసన్ 56 బంతుల్లో 109 పరుగులు, తిలక్ 47 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ అభిషేక్ వర్మ 18 బంతుల్లో 36 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఛేజింగ్ లో సఫారీలకు ఏదీ అనుకున్నట్లుగా సాగలేదు. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, హార్ధిక్ పాండ్యా ఒక వికెట్ తీయడంతో దక్షిణాఫ్రికా టాపార్డర్ కుప్పకూలింది. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు, రవి బిష్ణోయ్, రమణ్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్క్ 1, రీజా హెండ్రిక్స్ 0, ఐడెన్ మార్క్రమ్ 8, ట్రిస్టన్ స్టబ్స్ 43, డేవిడ్ మిల్లర్ 36, మార్కో యన్సెన్ 29 (నాటౌట్), అండిలే సిమాలనె 25, కోయెట్జీ 12, కేశవ్ మహారాజ్ 6, సిపామ్ల 3 పరుగులు చేశారు. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు తెలుగు యువకుడు తిలక్ వర్మకు దక్కాయి.
Next Story