Mon Nov 25 2024 21:34:15 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్-12 లోకి అడుగుపెట్టిన జింబాబ్వే.. మన గ్రూప్ లోనే..!
సూపర్-12 లోకి జింబాబ్వే అడుగుపెట్టింది. స్కాట్లాండ్ పై జింబాబ్వే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 133 పరుగుల టార్గెట్ ను చేధించడానికి జింబాబ్వేకు 18.3 ఓవర్లు అవసరమయ్యాయి. 5 వికెట్ల తేడాతో జింబాబ్వే స్కాట్లాండ్ పై విజయాన్ని అందుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మున్సీ 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే మున్సీ బ్యాట్ ను ఝుళిపించకపోవడంతో స్కాట్లాండ్ ఆశించినంత స్కోరును సాధించలేకపోయింది. మిగిలిన వారెవరూ గొప్పగా రాణించకపోవడంతో జింబాబ్వే ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. చటారా, గరావా.. రెండేసి వికెట్లను తీసుకున్నారు.
లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినా.. క్రెయిగ్ ఇర్విన్, సికందర్ రజా మ్యాచ్ ను జింబాబ్వే చేతుల్లో ఉంచారు. ఇర్విన్ 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. రజా 23 బంతుల్లో 40 పరుగులు బాది.. టెన్షన్ లేకుండా చేశాడు. 5 వికెట్ల తేడాతో జింబాబ్వే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ విజయంతో సూపర్-12 లోకి అడుగుపెట్టింది. భారత జట్టు ఉన్న గ్రూప్ లోకి జింబాబ్వే చేరింది.
Next Story