Fri Jan 10 2025 20:09:00 GMT+0000 (Coordinated Universal Time)
అక్షర్ పటేల్ ఆదుకోకుంటే ఇక అంతేనా..?
భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 61 పరుగుల ఆధిక్యతతో ఉంది
ఢిల్లీలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 61 పరుగుల ఆధిక్యతతో ఉంది. ఒక వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఒక పరుగు ఆధిక్యత సంపాదించిన ఆస్ట్రేలియా తర్వాత అరవై పరుగులు చేసింది. అయితే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ను జడేజా అవుట్ చేయడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయినట్లయింది.
అందరూ వరసగా...
అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన భారత్ 139 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లు సూపర్ భాగస్వామ్యంతో రాణించడంతో భారత్ పరువును కాపాడినట్లయింది. కేఎల్ రాహుల్ 17, రోహిత్ శర్మ 32, శ్రేయస్ అయ్యర్ నాలుగు, విరాట్ కొహ్లి 44, భరత్ ఆరు పరుగులకు అవుట్ అయ్యారు. దీంతో భారమంతా స్పిన్నర్ల మీదనే పడింది. వారే ఆల్ రౌండర్ ప్రతిభను కనపర్చారు. అక్షర్ పటేల్ 74, రవి చంద్రన్ అశ్విన్ లు 31 పరుగులు చేసి భారత్ ను బయట పడేశారు. కొహ్లి అవుట్ వివాదమయినా అంపైర్ అవుట్ గా నిర్ధారించడంతో పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. వారిద్దరూ క్రీజ్ లో నిలవకుంటే భారత్ తక్కువ పరుగులకు అవుటయ్యేది. ఆ గండం నుంచి ఇద్దరూ భారత్ ను గట్టెక్కించారు.
Next Story