Fri Dec 20 2024 16:20:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు భారత్ - న్యూజిలాండ్ రెండో వన్డే
భారత్ - న్యూజిలాండ్ రెండో వన్డే నేడు జరగనుంది. రాయపూర్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్ - న్యూజిలాండ్ రెండో వన్డే నేడు జరగనుంది. రాయపూర్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 1 - 0 తేడాతో సిరీస్ లో ఆధిక్యంలో ఉన్న భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. అయితే మొదటి వన్డేలో స్వల్ప తేడాతో ఓటమిపాలయిన న్యూజిలాండ్ కసితో మైదానంలోకి అడుగు పెడుతుంది. రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి.
ఇరు జట్లు బలంగా...
ఇటీవల శ్రీలంక తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ న్యూజిలాండ్ ను కూడా సొంత గడ్డపై ఓడించాలని భావిస్తుంది. అయితే న్యూజిలాండ్ జట్టును అంత తేలిగ్గా తీసిపారేయడానికి వీలులేదు. తొలి వన్డేలో భారత్ 349 భారీ స్కోరు సాధించినా న్యూజిలాండ్ చివరి వరకూ పోరాటమే అందుకు ఉదాహరణ. ఈ పిచ్ బౌలింగ్, బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందంటున్నారు. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. వీకెండ్ లో మరో అద్భుతమైన మ్యాచ్ ను క్రికెట్ ఫ్యాన్స్ చూడబోతున్నారు.
- Tags
- india
- new zealand
Next Story