Fri Dec 20 2024 16:09:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాటింగ్ కు దిగిన భారత్
న్యూజిలాండ్ - భారత్ రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
న్యూజిలాండ్ - భారత్ రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందు భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్ లను పక్కన పెట్టి ఈ మ్యాచ్ లో భారత్ దీపక్ హుడా, దీపక్ చాహర్ లను జట్టులోకి తీసుకుంది. తొలి వన్డేలో భారత్ దారుణంగా ఓటమి పాలు కావడం, బౌలర్ల వైఫల్యం స్పష్టంగా కనపడటంతో కొన్ని మార్పులు చేసి బరిలోకి దిగింది.
ఈ మ్యాచ్ లో గెలిస్తేనే...
ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ ను నిలబెట్టుకునే పరిస్థితికి భారత్ చేరుకుంటుంది. ఈ మ్యాచ్ లో ఓటమి పాలయితే సిరీస్ భారత్ చేజారినట్లే. న్యూజిలాండ్ కూడా సిరీస్ గెలవాలన్న కసితో ఉంది. ఇరు జట్లు బలంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల టేబుల్ లో భారత్ అగ్రస్థానంలోనే నిలుస్తుంది.
- Tags
- new zealand
- india
Next Story