Mon Dec 23 2024 15:32:38 GMT+0000 (Coordinated Universal Time)
టీ 20 బిగిన్.. భారత్ బ్యాటింగ్
వెస్టిండీస్ తో జరగనున్న రెండో టీ 20 మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది
వెస్టిండీస్ తో జరగనున్న రెండో టీ 20 మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత భారత్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకిదిగుతున్నారు. విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్ లు భారత్ జట్టులో ఉన్నారు.
తొలి ఓవర్ లోనే...
వెస్టిండీస్ జట్టులో పొలార్డ్, బ్రైండన్, కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఫేబియన్ ఆలెన్, స్మిత్, అకీల్ హోసెయిన్, షెల్టన్ కాట్రెల్ లు ఉన్నారు. ఇప్పటికే తొలి టీ 20లో గెలిచిన భారత్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని వెస్టిండీస్ కసితో దిగింది. మొదటి తొలి ఓవర్ లోనే భారత్ పది పరుగులు చేసింది.
- Tags
- india
- second t20
Next Story