Sun Mar 30 2025 21:20:22 GMT+0000 (Coordinated Universal Time)
India vs England 2n T20 : చెన్నైలో తిప్పేస్తారా? అక్కడ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే?
భారత్ - ఇంగ్లండ్ మధ్య రెండో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది

భారత్ - ఇంగ్లండ్ మధ్య రెండో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించేందుకు అన్ని కసరత్తులు చేస్తుంది. ఇంగ్లండ్ ను మట్టి కరిపించాలని అన్ని విధాలుగా చూస్తుంది. అయితే కోల్ కత్తా జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ తో దుమ్మురేపిన అభిషేక్ శర్మ ప్రాక్టీస్ సమయంలో గాయపడటంతో ఓపెనర్ గా ఎవరు దిగుతారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లు ఓపెనర్లుగా దిగితే ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తారని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ గాయపడటంతో ఓపెనర్ గా ఎవరు దిగుతారన్నది ఇంకా తేలలేదు. అయితే కోల్ కత్తాలో సాధించిన విజయంతో ఊపు మీదున్న టీం ఇండియా అదే ఒరవొడిని కొనసాగించాలనుకుంటోంది. ఈ మ్యాచ్ లో టాస్ కీలకంగా మారనుంది.
ఇంగ్లండ్ జట్టు కూడా...
ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు కసి మీద రగిలిపోతుంది. తొలి మ్యాచ్ లో కోల్ కత్తా మైదానం తమకు అనుకూలించలేదని, అదృష్టం ఇండియా వైపు తొంగి చూసిందని ఇంగ్లండ్ బౌలర్ ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కోల్ కత్తాలో లాగా ఈ మ్యాచ్ వన్ సైడ్ ఉండదన్నది మాత్రం క్రీడా నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఉత్కంఠ భరితంగానే సాగే అవకాశముందని చెబుతున్నారు. ఇంగ్లండ్ తన తొలి మ్యాచ్ లో బట్లర్ అత్యథిక పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో కూడా బట్లర్ తో పాటు మిగిలిన ఆటగాళ్లు కూడా చెలరేగిపోతారని, భారీ స్కోరు సాధించడం ఖాయమన్న విశ్వాసంతో ఉంది. అదే సమయంలో భారత్ కూడా తక్కువ బాల్స్ లో ఎక్కువ పరుగులు చేయగల వారిని ఎంపిక చేసే అవకాశముంది.
స్కై నిలబడితే చాలు...
నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడతారన్న ధీమాతో టీం ఇండియా ఉంది. తొలి మ్యాచ్ లో విఫలమయిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లో నిలదొక్కుకోగలిగితే ఇండియా పరుగులను ఆపడం ఎవరి తరమూ కాదంటున్నారు. మరో వైపు చెన్నైలోని చపాక్ స్టేడియం స్పినర్లకు అనుకూలం. అందుకే స్పిన్నర్లను ఎక్కువ మందిని దించనున్నారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి ఆడే ఛాన్స్ ఉంది. ఇందులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లు ఆల్ రౌండర్లు కావడం టీం ఇండియాకు కలసి వచ్చే అంశంగా చూడాలని చెబుతున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచి భారత్ ఇంగ్లండ్ పై జరిగే సిరీస్ లో ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుందాం.
Next Story