Mon Dec 23 2024 03:03:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు శ్రీలంకతో భారత్ రెండో టీ 20
ఈరోజు భారత్ - శ్రీలకంల మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరగబోతుంది. పూనేలో రెండో టీ20 జరగనుంది
స్వదేశంలో జరుగుతున్న టీ 20 సిరీస్ ను భారత్ ఈరోజు జరిగే మ్యాచ్ తోనే దక్కించుకోవాలని చూస్తుంది. ఈరోజు భారత్ - శ్రీలకంల మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరగబోతుంది. పూనేలో రెండో టీ20 జరగనుంది. రాత్రి 7గంటలకు జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనుంది. భారత్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశమిచ్చినట్లు తెలిసింది. అలాగే ఉమ్రాన్ కు బదులుగా అర్ష్దీప్ ను సెకండ్ మ్యాచ్ లో ఆడించనుంది.
రెండు మార్పులతోనే.....
ఈ రెండు మార్పులతోనే భారత్ జట్టు మరిలోకి దిగనుంది. బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. తొలి మ్యాచ్ లో బ్యాటర్లు విఫలమయినప్పటికీ బౌలర్లు రాణించడంతో రెండు పరుగులతో భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ నుసొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. అదే సమయంలో శ్రీలంక జట్టు కూడా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై నమ్మకం పెట్టుకోవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కాబోతుంది.
Next Story