Sun Apr 06 2025 03:24:08 GMT+0000 (Coordinated Universal Time)
Indai vs Australia : నేటి నుంచి భారత్ - ఆస్ట్రేలియా రెండో టెస్ట్
భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది

భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ లు ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్ట్ కు అందుబాటులో లేకపోవడంతో ఈ ఇద్దరే ఓపెనర్లుగా ఆడారు. ప్రస్తుతం రెండో టెస్ట్ కు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. అయినా రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ లో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
తొలిటెస్ట్ లో గెలిచి...
తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ రెండో టెస్ట్ లోనూ ఓడించాలన్న కసితో ఉంది. కానీ ఆస్ట్రేలియా కూడా తమ సొంత గడ్డపై తమకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆడిలైడ్ వేదికను ఉపయోగించుకోవాలని భావిస్తుంది. తమకున్న అనుకూల పరిస్థితులను మలచుకుని భారత్ ను దెబ్బతీయాలని చూసింది. ప్రస్తుతం సిరీస్ లో భారత్ 1-0 లో ఆధిక్యతలో ఉంది. పిక్ బాల్ తో జరిగే ఈ డే అండ్ నైట్ మ్యాచ్ లో గెలుపు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. రెండు జట్లు గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి.
Next Story