Mon Dec 23 2024 07:41:12 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి భారత్ - ఇంగ్లండ్ రెండో టెస్ట్
ఇండియా - ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. విశాఖ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది
ఇండియా - ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. విశాఖ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు విశాఖకు చేరుకుని ప్రాక్టీస్ ను ప్రారంభించాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమి పాలయిన భారత్ రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అందుకోసం జట్టులో కొన్ని మార్పులు చేస్తుంది. ఈ మ్యాచ్ కు విరాట్ కొహ్లి, జడేజా, కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నారు.
ఇంగ్లండ్ కూడా...
తొలి టెస్ట్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిక్యతను నిలబెట్టుకోవాలని భావిస్తుంది. ఇంగ్లండ్ జట్టు కూడా స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతుంది. విశాఖ స్టేడియం ఇండియాకు కలసి వచ్చే స్టేడియంగా భావిస్తారు. మరి ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే రెండు జట్ల స్కోరు సమానం అవుతుంది. మరి మనోళ్ల ఎలా ఆడతారన్నది చూడాల్సి ఉంది.
Next Story