Wed Nov 06 2024 01:39:16 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచ కప్ లో భారత్ తో మ్యాచ్ కోసం అతడు సిద్ధమట
అతను ప్రస్తుతం 90 శాతం ఫిట్‌గా ఉన్నాడు. ప్రపంచ కప్ సమయానికి సిద్ధంగా..
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీది.. గాయం కారణంగా గత కొద్దిరోజులుగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ లో కూడా షాహీన్ ఆడలేదు. ప్రపంచకప్ లో కూడా అతడు ఆడుతాడో లేదో అనే అనుమానాలు ఉండగా.. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుండి అధికారిక ప్రకటన వచ్చింది. అతడు ఫిట్ గా ఉన్నాడని.. ఈ ఏడాది ప్రపంచ కప్ లో భారత్ తో తలపడే మ్యాచ్ లో ఆడబోతున్నాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెద్దలు చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది T20 ప్రపంచ కప్‌లో పాల్గొనడం సందేహంగానే ఉండేది. చాలా మంది మాజీ ఆటగాళ్ళు షాహీన్ పూర్తి ఫిట్‌గా లేకుంటే రిస్క్ చేయకూడదని సూచిస్తూ వచ్చారు. ఆగస్టులో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో మోకాలి గాయంతో బాధపడుతూ వచ్చాడు షాహీన్. గాయం కారణంగా గత నెలలో జరిగిన ఆసియా కప్‌కు కూడా దూరమయ్యాడు. అయితే, టీ20 ప్రపంచకప్‌కు అతడు ఫిట్‌గా ఉన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా వెల్లడించారు. "నేను షాహీన్‌తో చాట్ చేసాను. అతని ఫిట్నెస్ పురోగతి చాలా బాగుంది. డాక్టర్లు వీడియో పంపారు. అతను ప్రస్తుతం 90 శాతం ఫిట్‌గా ఉన్నాడు. ప్రపంచ కప్ సమయానికి సిద్ధంగా ఉంటాడని షాహీన్ నాతో చెప్పాడు, "అని రమీజ్ డాన్ న్యూస్‌తో అన్నారు. భారత్ తో ప్రపంచ కప్ లో మ్యాచ్ ఆడడానికి ముందు షాహీన్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. టోర్నమెంట్ లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాక్ మ్యాచ్ కు సిద్ధంగా ఉండటానికి ముందు షహీన్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలని యోచిస్తున్నట్లు రమీజ్ వెల్లడించాడు. "ఈ మోకాలి గాయాలు కొన్నిసార్లు సాంకేతికంగా మరియు సున్నితమైనవిగా ఉంటాయి. కాబట్టి, అతను పూర్తిగా ఫిట్‌గా లేకుంటే, మేము అతనిని రిస్క్ చేయబోమని మేము చర్చించాము. కానీ, ప్రస్తుతం 110 శాతం ఫిట్‌గా ఉన్నానని షాహీన్ చెబుతున్నాడు. అతను ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడతానని, భారత్‌తో జరిగే మ్యాచ్‌కి సిద్ధమవుతానని చెప్పాడు." అని రమీజ్ రాజా వెల్లడించాడు. ఆదివారం, అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్-భారత్ తలపడనున్నాయి.
Next Story