10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా
అద్భుతమైన టచ్ లో కనిపించిన శ్రేయాస్ అయ్యర్ హారిస్ రౌఫ్ బౌలింగ్ లో
ఆసియా కప్ లో భాగంగా టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కు వరుణుడు మొదట ఆటంకం కలిగించాడు. ఆ తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు పాక్ బౌలర్స్ నుండి కఠిన పరీక్ష ఎదురైంది. రైన్ బ్రేక్ తర్వాత షాహీన్ షా అఫ్రీది రెచ్చిపోయాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మను ఇన్ స్వింగ్ డెలివరీతో బోల్తా కొట్టించిన ఈ లెఫ్టార్మ్ సీమర్... ఆ తర్వాత కాసేపటికే కోహ్లీని ఇన్ సైడ్ ఎడ్జ్ తో పెవిలియన్ పంపాడు. అద్భుతమైన టచ్ లో కనిపించిన శ్రేయాస్ అయ్యర్ హారిస్ రౌఫ్ బౌలింగ్ లో ఫకర్ జమాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయ్యర్ 9 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 11.2 ఓవర్ల వద్ద మరోసారి వర్షం అడ్డు పడింది. టీమిండియా 3వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. గిల్ 6 పరుగులు.. ఇషాన్ కిషన్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.