Sat Dec 21 2024 10:36:13 GMT+0000 (Coordinated Universal Time)
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై షాహిద్ అఫ్రీది కౌంటర్లు
ఆదివారం నాడు పెర్త్‌లో నెదర్లాండ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి పాకిస్థాన్ 2022 టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. డచ్ జట్టును 20 ఓవర్లలో 91/9 స్వల్ప స్కోరుకు పరిమితం చేసిన పాకిస్థాన్ 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ 39 బంతుల్లో 49 పరుగులతో రాణించాడు. షాదాబ్ ఖాన్ మూడు వికెట్లతో డచ్ బ్యాటర్లను అవుట్ చేశాడు. ఇక పాకిస్థాన్ జట్టును చాలా ఇబ్బంది పెడుతున్న అంశమేమిటంటే ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం ఫామ్.. నెదర్లాండ్స్ మ్యాచ్ లో కూడా బాబర్ ఫ్లాప్ అయ్యాడు. కెప్టెన్ బాబర్ ఐదు బంతుల్లో 4 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మ్యాచ్ రెండో ఓవర్లో బాబర్ రనౌట్ అయ్యాడు. ప్రపంచ కప్‌లో గత మూడు మ్యాచ్‌లలో పాకిస్తాన్ కెప్టెన్ 0, 4, 4 స్కోర్లను నమోదు చేశాడు.
కొన్ని నెలల క్రితం, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్లో ఇదే విధంగా తక్కువ పరుగులు చేస్తున్నప్పుడు.. బాబర్ విరాట్ కోహ్లీకి మద్దతుగా హృదయపూర్వక ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ "This too shall pass. Stay strong," అని తన అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. బాబర్ నెదర్లాండ్స్ పై విఫలమయ్యాక భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ కెప్టెన్ కోసం సరిగ్గా ఇలాంటి ట్వీట్‌ను పెట్టాడు. "This too shall pass. Stay strong," అంటూ అమిత్ మిశ్రా పోస్టు పెట్టాడు. పాకిస్థాన్‌కు చెందిన సమా టీవీలో అమిత్ మిశ్రా చేసిన ట్వీట్‌పై యాంకర్ స్పందించాడు. బాబర్ మంచి ఉద్దేశ్యంతో విరాట్ కోహ్లీ గురించి ట్వీట్ చేస్తే అమిత్ మిశ్రా ఎగతాళి చేస్తున్నాడని పేర్కొన్నాడు.
షోలో భాగమైన షాహిద్ అఫ్రిది స్పందిస్తూ, "యే జో ఆప్ నామ్ లే రహే హై అమిత్ మిశ్రా, యే భీ ఇండియా సే ఖేలా హువా హై. యే స్పిన్నర్ థా కీ బ్యాట్స్‌మన్ థా? (మీరు చెబుతున్న ఈ పేరు, అమిత్ మిశ్రా, అతను కూడా భారతదేశం కోసం ఆడాడా.. అతను స్పిన్నర్ లేదా బ్యాట్స్‌మన్?)" అంటూ ఎగతాళిగా మాట్లాడాడు.
Next Story