Mon Dec 23 2024 11:46:02 GMT+0000 (Coordinated Universal Time)
Divorce Rumors : సానియాతో విడాకులపై స్పందించిన షోయబ్ మాలిక్
కాగా.. షోయబ్ కు 2002లో అయేషా సిద్ధిఖీ అనే మహిళతో వివాహమవ్వగా.. 2010లో ఆమె నుండి విడిపోయి సానియా మీర్జాను..
భారత టెన్నిస్ క్రీడా కారిణి సానియా మీర్జా - పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఇంతవరకూ సానియా స్పందించలేదు. తాజాగా షోయబ్ ఈ ప్రచారంపై పెదవి విప్పాడు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారమని చెప్పాడు. ఈ వ్యవహారంపై తాను గానీ, తన భార్య సానియా మీర్జా కానీ ఇంతమించి స్పందించాలని అనుకోవడం లేదని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని పేర్కొన్నాడు షోయబ్. ఇక ఈ అంశంపై తమను ఎలాంటి ప్రశ్నలు అడగవద్దని కోరాడు.
కాగా.. షోయబ్ కు 2002లో అయేషా సిద్ధిఖీ అనే మహిళతో వివాహమవ్వగా.. 2010లో ఆమె నుండి విడిపోయి సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరికి ఇషాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం షోయబ్ పాకిస్థాన్ నటి ఆయేషా ఒమర్ తో సన్నిహితంగా ఉండటంవల్లే వీరి కాపురంలో చిచ్చురేగిందని ప్రచారం సాగుతోంది. కాగా.. వాళ్లిద్దరికీ ఎప్పుడో విడాకులు వచ్చేశాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో సానియా మీర్జా పెడుతున్న కొన్ని పోస్టులు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. తాజాగా షోయబ్ చేసిన వ్యాఖ్యలు కూడా విడాకుల రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి.
Next Story