Mon Dec 23 2024 01:19:58 GMT+0000 (Coordinated Universal Time)
సానియా మీర్జాను అన్నేళ్లుగా షోయబ్ మాలిక్ మోసం చేస్తూనే ఉన్నాడా..?
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల నటి సనా జావేద్‌ను వివాహం
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు. షోయబ్ మాలిక్ సానియా మీర్జాకు విడాకులు ఇవ్వడం సంచలం రేపింది. అయితే సానియా-షోయబ్ వివాహ బంధంలో ఉన్న సమయంలోనే సానియాను మోసం చేస్తూ సనా జావేద్ తో ఉండేవాడని పాక్ మీడియా తెలిపింది.
షోయబ్ మాలిక్-సనా జావేద్ మధ్య మూడు సంవత్సరాల సుదీర్ఘ సంబంధాన్ని బహిర్గతం చేసింది సామా టీవీ. పాకిస్తాన్ జర్నలిస్ట్ నయీమ్ హనీఫ్ వారి రిలేషన్ షిప్ గురించి వివరాలను వెల్లడించారు. హనీఫ్ ప్రకారం, ఈ జంట మొదట రియాలిటీ షో సెట్లో బంధం బలపడిందని తెలిపారు. షోయబ్‌ను టీవీ కార్యక్రమాలకు ఆహ్వానించినప్పుడల్లా, అతను సనాను బోర్డులోకి తీసుకురావాలని పట్టుబట్టినట్లు సమాచారం. వారి గత వివాహాలలో ఇద్దరూ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, వారి మధ్య బంధం బలపడుతూనే వచ్చింది. దీంతో చివరికి బంధానికి బీటలువారింది. సానియా మీర్జా చొరవ తీసుకుని షోయబ్ మాలిక్ కుటుంబీకులకు పరిస్థితిని తెలియజేసినట్లు సదరు జర్నలిస్ట్ తెలిపారు. కుటుంబ సభ్యులు మధ్యవర్తిత్వం వహించి దంపతుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో భాగంగా దుబాయ్‌కి వెళ్లవలసి వచ్చింది. ఈ సంబంధాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో షోయబ్, సానియా విడాకులను ఎంచుకున్నారు.
ఇక షోయబ్ మాలిక్‌తో వివాహానికి ముందు సానియా మీర్జాకు తన చిన్ననాటి స్నేహితుడైన సోహ్రాబ్ మీర్జాతో నిశ్చితార్థం అయ్యింది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఇది జరిగింది. అయితే, పెళ్లికి కొద్దిరోజుల సమయం ఉందనంగా సానియా.. మాలిక్‌తో ప్రేమలో పడి, సోహ్రాబ్‌తో తన నిశ్చితార్థాన్ని విరమించుకుంది. అనంతరం కుటుంబసభ్యులను ఒప్పించి మాలిక్‌ను పెళ్లాడింది.
Next Story