Thu Apr 03 2025 02:27:50 GMT+0000 (Coordinated Universal Time)
Shubham Gill : కెప్టెన్ గా శుభమన్ గిల్... అతని పేరే ఖరారు
టీం ఇండియాకు స్ట్రాంగైన ఓపెనర్ శుభమన్ గిల్ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు

టీం ఇండియాకు స్ట్రాంగైన ఓపెనర్ శుభమన్ గిల్ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. అయితే టీం ఇండియాకు మాత్రం కాదు. కానీ కెప్టెన్ గా బాధ్యతలను శుభమన్ గిల్ నిర్వహించబోతున్నారు. త్వరలో జరగబోయే ఐపీఎల్ లో శుభమన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా నియమితుడయ్యాడు. హార్థిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను వదిలి పెట్టి ముంబయి ఇండియన్స్ కు వెళ్లిపోవడంతో ఆ జట్టు యాజమాన్యం గిల్ కు పగ్గాలు అప్పగించింది. గిల్ గుజరాత్ టైటాన్స్ కు ఐపీఎల్ 2024 కు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
ఐపీఎల్ ద్వారానే...
ఐపీఎల్ ద్వారానే శుభమన్ గిల్ ఎవరో ప్రపంచానికి తెలిసింది. తర్వాత తన స్థానాన్ని టీం ఇండియాలో సుస్థిర పర్చుకున్నారు. వన్డే వరల్డ్ కప్ లోనూ అత్యధిక పరుగులు చేసి అందరి మన్ననలను గిల్ అందుకున్నారు. ఓపెనర్ బరిలోకి దిగి సెంచరీలు చేసి అందరినీ మెప్పించాడు. కేవలం వన్డేలలోనే కాదు ఐపీఎల్లోనూ గిల్ ట్రాక్ రికార్డు చూస్తే తక్కువేమీ కాదు. సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడేస్తాడు. గిల్ కుదురుకున్నాడంటే చాలు భారీ స్కోరు చేయనిదే వెనుదిరగడన్న పేరుంది.
అత్యధిక పరుగులు...
ఐపీఎల్ లో 890 పరుగులు చేసిన శుభమన్ గిల్ మొన్న వన్డే ప్రపంచ కప్ లోనూ అత్యధిక పరుగులు చేయడంతో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ 2022 లో ఛాంపియన్ గా నిలవడంలో గిల్ పాత్రను తోసిపారేయలేం. 2022లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన శుభమన్ గిల్ కు తాను చూపించిన పెర్ఫార్మెన్స్ తో పాటు దూకుడు కూడా అవకాశాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు గిల్ కు పదోన్నతి లభించడం పట్ల శుభమన్ గిల్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తనకు అప్పగించిన బాధ్యతలను సజావుగా నిర్వహిస్తానని చెబుతున్నాడు.
Next Story