Mon Dec 23 2024 02:40:20 GMT+0000 (Coordinated Universal Time)
షాక్ లో విరాట్ కోహ్లీ అభిమానులు.. గిల్ విశ్వరూపం
భారత జట్టులో ఫిట్నెస్ అంటే విరాట్ కోహ్లీ.. అతడిని యోయో టెస్ట్ లలో బీట్ చేసే
భారత జట్టులో ఫిట్నెస్ అంటే విరాట్ కోహ్లీ.. అతడిని యోయో టెస్ట్ లలో బీట్ చేసే వాళ్లు చాలా అరుదుగా ఉంటారని అంటుంటారు. తాజాగా విరాట్ కోహ్లీకి, అతడి అభిమానులకు యంగ్ ఓపెనర్ శుభమాన్ గిల్ షాక్ ఇచ్చాడు. ఆసియా కప్ టోర్నీ కోసం సిద్దమవుతున్న ఆటగాళ్లు ఇటీవల యోయో టెస్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో 17.2 పాయింట్లు స్కోర్ చేసినట్లు కోహ్లీ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ 18.7 పాయింట్లు స్కోర్ చేసి మిగతా ఆటగాళ్లకంటే ముందు నిలిచాడు. ఈ ఫిట్ నెస్ పరీక్షకు హాజరైన ఆటగాళ్లందరూ కటాఫ్ పాయింట్లు 16.5 దాటారని అధికారులు తెలిపారు.
కర్ణాటక ఆలూర్ లోని స్టేట్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ లో ఆగస్టు 29 వరకూ ఈ క్యాంపు కొనసాగనుంది. ప్రతీ రోజూ 6 గంటల పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటారు భారత క్రికెటర్లు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ప్రాక్టీస్ చేస్తారు. భారత జట్టు ట్రైయినింగ్ సెషన్స్‌ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు కోచింగ్ స్టాఫ్ క్షుణ్ణంగా మానిటర్ చేస్తోంది. ఈసారి ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో రాజీ పడకుండా ప్లేయర్లను ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయనుంది బీసీసీఐ.
Next Story