Mon Dec 23 2024 10:24:45 GMT+0000 (Coordinated Universal Time)
జింఖానా వద్ద టెన్షన్.. పోలీసుల లాఠీఛార్జి
జింఖానా గ్రౌండ్స్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రికెట్ ఫ్యాన్ పై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు
జింఖానా గ్రౌండ్స్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా గేట్లు విరగ్గొట్టి దూసుకు రావడంతో కొందరు కిందపడి పోయారు. దీంతో కొందరు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో పోలీసులు క్రికెట్ అభిమానులపై లాఠీ ఛార్జీ చేశారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో వందల సంఖ్యలో వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్ దూసుకు వచ్చారు.
అంచనాకు మించి...
ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లో ఇండియా - ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ జరగనుంది. కొన్ని టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచారు. అవి క్షణాల్లో అయిపోయాయి. అయితే క్రికెట్ అభిమానుల కోసం ఆఫ్లైన్ లో కూడా టిక్కెట్లు విక్రయించాలన్న డిమాండ్ రావడంతో జింఖానా గ్రౌండ్స్ లో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. క్రికెట్ మ్యాచ్ కోసం ఆఫ్లైన్ టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు పెద్ద యెత్తున తరలి వచ్చారు. వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. నాలుగు కౌంటర్లు ఉన్నప్పటికీ అంచనా మించి అభిమానులు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది.
Next Story