Mon Dec 23 2024 07:27:22 GMT+0000 (Coordinated Universal Time)
India vs England Third Test : బుమ్రాను దూరం పెడితే... విజయం దక్కుతుందా? ఫ్యాన్స్ లో అనుమానాలు
భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకూ రెండు టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. చెరో మ్యాచ్ విజయం సాధించాయి
భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకూ రెండు టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. రెండు మ్యాచ్‌లో చెరో జట్టు విజయం సాధించింది. హైదరాబాద్ లో ఇంగ్లండ్ విజయం సాధించగా, విశాఖపట్నంలో భారత్ జట్టు విక్టరీ కొట్టింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో 1 -1 స్కోరుతో సమావంగా ఉన్నాయి. మూడో టెస్ట్ ఎవరిదన్న ఉత్కంఠ క్రికెట్ ఫ్యాన్స్ లో నెలకొంది. మూడో టెస్ట్ ఈ నెల 15వ తేదీ నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు రెండు జట్లు శ్రమిస్తాయి.
కీలక భూమిక పోషించి...
అయితే భారత్ జట్టులో మూడో టెస్ట్ కు పేసర్ బుమ్రా ఉండరని అంటున్నారు. బుమ్రా రెండు మ్యాచ్ లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ లో కీలక భూమిక పోషిస్తున్నాడు. అయితే శక్తికి మించి ఆడుతుండటంతో బుమ్రా అలసి పోయాడని భావించిన బీసీసీఐ బుమ్రాను మూడో టెస్ట్‌ు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. మూడో టెస్ట్ కు విశ్రాంతి నిచ్చి చివరి రెండు టెస్ట్‌లకు ఆడిస్తే భారత్ విజయానికి దోహదపడతారని బీసీసీఐ అంచనాగా వినిపిస్తుంది.
అలసిపోవడంతో....
రెండు టెస్ట్‌లలో బుమ్రా 57 ఓవర్లు బౌలింగ్ చేయడంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలన్న నిర్ణయానికి బీసీసీఐ వచ్చింది. దీంతో మూడో టెస్ట్‌లో బుమ్రా స్థానంలో సిరాజ్ ను తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం బుమ్రాను కొనసాగిస్తే మంచిదని కోరుకుంటున్నారు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న బుమ్రాను పక్కన పెడితే మూడో జట్టులో వికెట్లు తీయడం కష్టమవుతుందని, నాలుగు, ఐదో టెస్ట్‌లపై అతనిపై వత్తిడి పెరుగుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story