నోరు విప్పిన సౌరవ్ గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీని కావాలనే తప్పించారని ఇన్ని రోజులూ కథనాలు వచ్చాయి. కొందరు గంగూలీ ఎదుగుదలను చూడలేకనే తప్పించారని వ్యాఖ్యలు చేయగా.. మరికొందరేమో బీజేపీలో గంగూలీ చేరకపోవడమే ఆయన ఉద్వాసనకు కారణమైందని ఆరోపించారు. ఊహాగానాలు తారాస్థాయికి చేరుకున్న సమయంలో సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంధన్ బ్యాంక్ ఈవెంట్లో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ.. చాన్నాళ్ల నుంచి పరిపాలకుడి పాత్రను పోషించానని, ఇప్పుడు మరో పాత్రను పోషించాలని భావిస్తున్నట్లు తెలిపారు. చాన్నాళ్లుగా అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నానని, ఇప్పుడు మరో ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆశిస్తున్నట్లు గంగూలీ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఏది చేసినా, ఉత్తమ రోజులు మాత్రం ఇండియాకు ఆడడమే అని అన్నారు. బీసీసీఐకి ప్రెసిడెంట్‌గా చేశానని, ఇక ముందు మరిన్ని గొప్ప పనులు చేయనున్నట్లు చెప్పారు. ఎప్పటికీ ప్లేయర్‌గా ఉండలేమని, అలాగే ఎప్పటికీ పరిపాలకుడిగా ఉండలేమని అన్నారు. ఆ రెండూ చేయడం సంతోషంగా ఉందని గంగూలీ అన్నారు.