Mon Dec 23 2024 16:12:03 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఇంట విషాదం
మీడియా సంస్థల్లో అత్యధికం చనిపోయిన చిన్నారి మిల్లర్ కుమార్తెగానే చెబుతుండగా, మరికొన్ని మాత్రం అతడికి బాగా దగ్గరైన..
సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గారాల కూతురు కేన్సర్ తో పోరాడుతూ కన్నుమూసింది. ఈ విషయాన్ని మిల్లర్ స్వయంగా వెల్లడించాడు. ''మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా'' అని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. కానీ.. ఈ పోస్ట్ లో మిల్లర్ ఆమె పేరును ప్రస్తావించకపోవడంపై అనుమానాలున్నాయి. చనిపోయింది అతని కుమార్తె అయి ఉండదని చాలా మంది భావిస్తున్నారు.
మీడియా సంస్థల్లో అత్యధికం చనిపోయిన చిన్నారి మిల్లర్ కుమార్తెగానే చెబుతుండగా, మరికొన్ని మాత్రం అతడికి బాగా దగ్గరైన అభిమాని అంటున్నారు. మిల్లర్ కూడా తమ మధ్య బంధాన్ని వెల్లడించకపోవడంతో ఆ చిన్నారి ఎవరన్న విషయం మిస్టరీగా మారింది. మిల్లర్ ప్రస్తుతం భార్యతో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా జట్టులో ఉన్నాడు. నేడు రాంచీలో భారత్-సఫారీల మధ్య రెండో వన్డే జరగాల్సి ఉంది. మిల్లర్ పోస్ట్ తో ఆ జట్టులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story