Mon Dec 23 2024 01:22:42 GMT+0000 (Coordinated Universal Time)
55 పరుగులకే ఆలౌట్: రివెంజ్ ప్లాన్ చేసిన భారత్
మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమికి భారత జట్టు రివెంజ్ ను ప్లాన్ చేసినట్లు
మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమికి భారత జట్టు రివెంజ్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా చేతిలో మొదటి టెస్టు మ్యాచ్ లో ఇన్నింగ్స్ తేడాతో భారతజట్టు ఓడిపోగా.. కొత్త సంవత్సరంలో భారత జట్టు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించింది. 55 పరుగులకే సఫారీలను మొదటి ఇన్నింగ్స్ లో పెవిలియన్ చేర్చింది. స్లిప్ లో భారత ఫీల్డర్లు అద్భుతంగా క్యాచ్ లు పట్టారు. మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో చెలరేగిపోయాడు. 9 ఓవర్లు బౌలింగ్ వేసిన సిరాజ్ 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. బుమ్రా, ముఖేష్ కుమార్ లు చెరో 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. ప్రసిద్ధ్ కృష్ణకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరిన్నే దక్షిణాఫ్రికా తరపున డబుల్ డిజిట్ చేసిన బ్యాటర్లు. మిగతా ఎవరూ కూడా సింగిల్ డిజిట్ దాటలేదు. డేవిడ్ బెడింగ్హామ్ 12 పరుగులు చేయగా.. కైల్ వెరిన్నే 15 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పిచ్ మీద గ్రాస్ ఉండడం బౌలర్లకు బాగా సహకరించింది. ఈ పిచ్ మీద భారత బ్యాటర్లు ఎలా ఆడుతారో అన్నది చూడాలి.
Next Story