Fri Nov 22 2024 06:56:48 GMT+0000 (Coordinated Universal Time)
సెంచరీ బాదిన తెలుగోడు.. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం
తెలుగు తేజం తిలక్ వర్మ సెంచరీతో దక్షిణాఫ్రికా ముందు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది.
దక్షిణాఫ్రికాపై తెలుగు తేజం తిలక్ వర్మ సెంచరీ బాదాడు. సెంచరీతో వర్మ మెరవడంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా భారత్ కు బ్యాటింగ్ ను ఇచ్చింది. అయితే మొదటి ఓవర్లోనే ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు వరుసగా రెండు సెంచరీలు బాదిన సంజూ.. రెండు మ్యాచుల్లో వరుసగా డకౌట్ అయ్యాడు. అయితే భారత బ్యాటర్లు ఏ మాత్రం వెనుదిరగకుండా బాదుడు మొదలుపెట్టారు. అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అతడితో కలిసి తిలక్ వర్మ కూడా బౌండరీలతో సఫారీలపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్లు హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. రింకూ సింగ్ కూడా పెద్దగా రాణించలేదు.. 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో రమణ్ దీప్ సింగ్ 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 107 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, అండీలే సిమాలానే రెండేసి వికెట్లు తీశారు.
Next Story