Mon Dec 23 2024 20:29:42 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజూ భారత్ తొలుత బ్యాటింగ్
దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. టీం ఇండియా ఈరోజు ఎన్ని పరుగులు తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీలో జరిగిన మొదటి టీ 20లో ఇండియాను ఓడించిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్ ను కూడా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఒడిశాలోని కటక్ లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత బ్యాటింగ్ కు దిగననున్న టీం ఇండియా ఈరోజు ఎన్ని పరుగులు తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
స్వల్ప మార్పులతో....
తొలి టీ 20లో 211 స్కోరును దక్షిణాఫ్రికా సులువుగా ఛేజ్ చేయగలిగింది. బౌలర్లు విఫలమయ్యారు. మార్పులు ఏమీ లేకుండానే టీం ఇండియా బరిలోకి దిగనుంది. కటక్ స్టేడియం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడిపోతుంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story