Mon Dec 23 2024 08:21:18 GMT+0000 (Coordinated Universal Time)
INDvsSL: టీమిండియాను టెన్షన్ పెట్టిన లంక.. బౌలింగ్ లో పస లేనట్లేనా?
శ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా.. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో
శ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా.. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఒకానొక దశలో ఆ జట్టు స్కోరు 8 ఓవర్లకే 80 పరుగులు దాటింది. ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక 79, కుశాల్ మెండిస్ 45 పరుగులతో భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. 14 ఓవర్లలో 140 పరుగులు చేసిన విజయం ఖాయం అన్నట్లుగా కనిపించింది. కానీ భారీ షాట్లకు ప్రయత్నించిన శ్రీలంక బ్యాటర్లు.. అనుభవం లేకపోవడంతో వరుసగా వికెట్లను సమర్పించేసుకున్నారు. చివరికి 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది.
కెప్టెన్ చరిత్ అసలంక (0), మాజీ కెప్టెన్ దసున్ షనక (0), కుశాల్ పెరీరా 20, కమిందు మెండిస్ 12 విఫలమయ్యారు. రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 2, మహ్మద్ సిరాజ్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. రెండో టీ20 మ్యాచ్ జులై 28న ఇదే మైదానంలో జరగనుంది.
Next Story